ప్రగతి రిసార్ట్స్ ఓ అరుదైన రికార్డు నమోదు చేసింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఈ మేరకు ప్రగతి గ్రీన్ మెడోస్, ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధిపతి డాక్టర్ గడ్డిపాటి బాలకోటేశ్వరరావు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న సువిశాల రిసార్ట్స్ ప్రాంగణంలో 650 పైగా మూలిక, ఔషధ మొక్కలు, వృక్ష జాతులు, పూల మొక్కలు వినూత్న రీతిలో సంరక్షిస్తూ పెంచుతున్నారు. 25 ఏళ్ల నుంచి 40 లక్షలకుపైగా మొక్కలు, చెట్లు పెంచుతూ జీవవైవిధ్యానికి పాటుపడుతూ భారత్ నుంచి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. అరుదైన మొక్కలు, వృక్ష జాతులు సంరక్షిస్తున్న డాక్టర్ GBK రావు… వృక్షోః రక్షితి రక్షితహః అన్న నినాదంతో ముందుకు సాగుతూ విస్తృత ప్రచారం చేస్తున్నారు.
#PragatiResorts #WorldBookofRecord