యునైటెడ్ నేషన్స్ వారు 2023 ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా ప్రగతి రిసార్ట్స్ వారు మరియు మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఖాదర్ వలీ గారి ఆధ్వర్యంలో అమృత ఆహారం ఆరోగ్య అవగాహన సదస్సును ఈరోజు శిల్పారామం లోని సాంప్రదాయ వేదికలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, తెలంగాణ శాసన మండలి చైర్మన్, ఎమ్మెల్సీ , శ్రీ ఎ. ఇంద్రకరణ్ రెడ్డి గారు, అటవీ & పర్యావరణ మరియు S&T, ఎండోమెంట్స్ అండ్ లా మంత్రివర్యులు, ప్రొఫెసర్ బి జగదీశ్వర్ రావు గారు ఉప కులపతి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, డాక్టర్ సిఎస్ఆర్ ప్రభుగారు, రిటైర్డ్. నేషనల్ డైరెక్టర్ జనరల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) మరియు ప్రగతి గ్రూప్ చైర్మన్ డాక్టర్ జిబికె రావు గారు పాల్గొనడం జరిగింది.