యునైటెడ్ నేషన్స్ వారు 2023 ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా ప్రగతి రిసార్ట్స్ వారు మరియు మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఖాదర్ వలీ గారి ఆధ్వర్యంలో అమృత ఆహారం ఆరోగ్య అవగాహన సదస్సును శిల్పారామం లోని సాంప్రదాయ వేదికలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ముఖ్య అతిథులుగా పాల్గొని పూర్వీకుల ఆహారపు అలవాట్లను తిరిగి అలవర్చుకోవాలని కోరడం జరిగింది.